అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రూల్’ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సౌండ్‌తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నారు. బన్నీ సంధ్య థియేటర్‌కు వస్తున్నాడని తెలుసుకున్న ఫాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. దాంతో అక్కడ భారీ తోపులాట జరిగింది.
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నల్లగండ్లలోని అపర్ణలో పుష్ప 2 చూస్తున్నారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు కుటుంబసభ్యులు, సన్నిహితులు అమీర్‌పేటలోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌లో సినిమా చుస్తునారు. ఏషియన్ మహేశ్ బాబు థియేటర్‌లో మైత్రీ మేకర్స్ నిర్మాతలు మూవీ చూస్తుండగా.. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో దిల్ రాజు, అనిల్ రావిపూడి చూస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ‘పుష్ప 2 ది రూల్’ సందడి మొదలైంది.