టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు.
నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్ కూడా హాజరయ్యారు. వివాహ వేడుకకు టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, నటి సుహాసిని, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు హాజరయ్యారు. దాదాపుగా దాదాపు 400 మంది అతిథులు హాజరయ్యారయినట్లు తెలుస్తోంది.