Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా!
- ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
- మార్కెట్‌ను పరిలిశీలించిన మంత్రి తుమ్మల
- ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని తెలిపారు. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా కొత్త మార్కెట్‌ను నిర్మిస్తా అని మంత్రి హామీ ఇచ్చారు.
‘మార్కెట్‌లో రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం. కారణం ఏంటో నాకు ఇంకా తెలీదు. నష్టం అంచనా వేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తా. ఈ మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా. ఈ మార్కెట్‌ను రూ.100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా. మార్కెట్ చుట్టుపక్కల విషాలవంతమైన రోడ్లు ఎర్పాటు చేస్తాం. మన మార్కెట్‌ని చూసి తెలంగాణ రాష్ట్రంలో అన్నీ మార్కెట్‌లు ఉండేలా చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండేలా కొత్త మార్కెట్‌ను నిర్మిస్తాం. పత్తి మార్కెట్‌ను కూడ ఆ రోజు నేనే ఏర్పాటు చేశా, ఇది కాలేజ్ స్థలం’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
Also Read: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
‘మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు. మద్ధులపల్లి మార్కెట్‌ను 10, 15 రోజుల్లో ప్రారంభిస్తాం. ఖమ్మం మార్కెట్‌కు, ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకూడదు. మార్కెట్ నిర్మాణం కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అతి త్వరలో మార్కెట్‌కు స్వరూపం మారాలి, అప్పటివరకు రైతులు అంతా సంయమనం పాటించాలి. మార్కెట్‌లో ఓ ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తాం. గతంలోనూ ఉండేది, ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. పసుపు బోర్డు వేరే రాష్ట్రాల్లో కావాల్సి ఉండగా.. నేను మన రాష్ట్రానికి కావాలని కోరాను. ప్రధాని నా అభ్యర్థన మేరకు బోర్డు ప్రకటించారు’ అని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!