పర్యాటకులకు భారీ షాక్. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్ ధరలు పెరిగాయి. అన్ని రకాల టికట్ ధరలను ప్రభుత్వం పెంచింది. మంగళవారం పార్క్‌లో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీలో చర్చించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ […]
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఈరోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమండో ఫోర్స్ (మార్కోస్) చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలకు దిగే సత్తా ఈ మార్కోస్‌కు ఉంటుంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీమ్ పాల్గొననుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్‌సింగ్ తన బృంద సభ్యులతో టన్నెల్ వద్దకు రానున్నారు. […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30కు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలానే ఎస్ఎల్బీసీ ప్రమాదంను పూర్తిస్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోడీతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో.. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. […]
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న ముసిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పిన అనంతరం మృతదేహాలను కారులో […]
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ‘ఇండియా మాస్టర్స్’ దూసుకెళుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్ గెలిచిన విషయం తెలిసిందే. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ […]
తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు స్థానాల్లో గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలని, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు.. ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. కులగణనకు […]
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తేబోతున్నాం అని, వర్గీకరణలో ఎవరి వాట వాళ్లకు అందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం మాములు విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. మార్చి 3న రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ ఉంటుందని మంత్రి దామోదర తెలిపారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు మంత్రి దామోదర, […]
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దని హెచ్చరించారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని కోరారు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప.. మీరు దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేయడం అవసరమా? […]
తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం […]