KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో నీటి నిర్వహణ, రైతుల పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు, రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడేది రాజకీయ అంశాలపై కాదని, పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం కేవలం 23% మాత్రమే నీరు ఉందని, మిగిలిన 77% సామర్థ్యం ఖాళీగా ఉందని పేర్కొన్నారు.
రిటైర్డ్ ఇంజినీర్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయవచ్చని సూచించారని కేటీఆర్ తెలిపారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేస్తే సుమారు 200 టీఎంసీల నీటితో గోదావరి బేసిన్‌ను సస్యశ్యామలం చేయవచ్చని వారు సూచించారని చెప్పారు. అయితే ఈ సూచనలను అమలు చేయకుండా సీఎం భేషజాలకు పోతున్నారని ఆరోపించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన కరువని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భద్రాచలం మునిగిపోతుందనే కారణంతో నీటిని ఎత్తిపోకుండా ఉండటం అర్థరహితమని వ్యాఖ్యానించారు. 2022లో గోదావరిలో భారీ వరదలు వచ్చినప్పటికీ మేడిగడ్డకు, భద్రాచలానికి ఎలాంటి నష్టం జరగలేదని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్పై కోపం ఉంటే కేసులు పెట్టాలని, విమర్శించాలని, కానీ రైతులపై ప్రతీకారం తీర్చుకోవద్దని కేటీఆర్ అన్నారు. రైతులను ఎండబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. సీఎం ఒకవైపు సర్వేలు నిర్వహిస్తూనే మరోవైపు 117 స్థానాలు గెలుస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం సీఎం నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78కిపైగా స్థానాలు వస్తాయని తేలిందన్నారు. మరో 4 సర్వేల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు.
హరీశ్ రావుపై తరచూ వస్తున్న పుకార్లను కేటీఆర్ ఖండించారు. హరీశ్ రావు నికార్సైన నాయకుడని, కేసీఆర్ తయారు చేసిన సైనికుడని కొనియాడారు. పార్టీ మార్పుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయన ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఖాతాలో ఉన్న నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పాత్రపై కూడా విమర్శలు గుప్పించారు. చివరగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 117 స్థానాలు కాదు, ఏకంగా 7 స్థానాలు కూడా రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!