Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
- ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్
- అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే
- మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Eyes Big Impact for India A: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శ్రీలంకలో ఈరోజు ప్రారంభమయ్యే ట్రై సిరీస్‌లో వండర్ కిడ్ ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. మరికొద్ది గంటల్లో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ ఆరంభం కానుండగా.. 15 ఏళ్ల ఈ బ్యాటింగ్ సంచలనం ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ నెల చివర్లో జరగనున్న ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ వైభవ్‌కు అత్యంత కీలకంగా మారింది.
ఐపీఎల్లో సంచలనం సృష్టించిన వైభవ్:
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన బుడ్డోడు.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
నెట్స్‌లో రక్షణాత్మక షాట్స్:
శ్రీలంక-ఏతో దంబుల్లాలో జరిగే మ్యాచ్‌కు ముందు జరిగిన నెట్ సెషన్లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పేరుగాంచిన అతడు పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అభిమానులు మాత్రం అతడి దూకుడైన షాట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తిలక్ వర్మ ప్రశంసలు:
వైభవ్‌పై ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్ వైభవ్‌కు పెను పరీక్షగా మారుతుందని పేర్కొన్నాడు. ఈ ఏడాది అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్.. ఇప్పుడు మరింత ఉన్నత స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడి ముందుంది చెప్పాడు.
టీ20లలో ఇప్పటికే విధ్వంసం:
టీ20 ఫార్మాట్లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.
ఇండియా-ఏ తరఫున ఇప్పటికే చరిత్ర:
గత ఏడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!