Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
- బాధిత కుటుంబాల్లోని పిల్లల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది
- కార్మికులకు భరోసా కల్పించాలన్నదే మా ఉద్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job for Vizag Steel Plant Victims Familyవిశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా నగరంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్న లోకేశ్.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్.. స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన పరిహారంతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని లోకేశ్ తెలిపారు. అలాగే మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్మికులకు భరోసా కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు.
Also Read
ప్రమాదంపై మాట్లాడిన నారా లోకేశ్.. ఉక్కు తయారీ ప్రక్రియలో ఎలాంటి వైఫల్యం లేదని, కెమికల్ రియాక్షన్లలో కూడా లోపాలకు అవకాశం కనిపించలేదని తెలిపారు. అయితే ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయం ఇప్పటికీ సిబ్బందికి, యాజమాన్యానికి పూర్తిగా అర్థం కాలేదన్నారు. ప్రమాదానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితులపై కూడా లోకేశ్ స్పందించారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వాల నిర్ణయాలు నష్టాల బాట పట్టించాయని విమర్శించారు. మృతుల అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి అవసరమైన సహాయంపై చర్చిస్తామని తెలిపారు.
విపత్తు బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం కేవలం పరిహారం ప్రకటించి మరిచిపోయే విధానం అనుసరించదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసినది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ను సందర్శించారని చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని, తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!