వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక […]
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్.. […]
Harry Brook Sledge Shubman Gill: ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన గిల్ సేన.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 72/3 స్కోరుతో ఉండగా.. చివరి రోజైన ఆదివారం భారత్ 7 వికెట్స్ తీస్తే మ్యాచ్ సొంతమవుతుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే […]
టెస్ట్ క్రికెట్లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది. గతంలో టీమిండియా […]
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని అంటారు. దీనినే ‘దేవశయని ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్లి.. కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడు. తొలి ఏకాదశి రోజున విష్ణు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం… ఏడాది జులై 6న తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం […]
ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం.. […]
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. […]
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం కలుపుకుని 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఇక ఆట చివరి రోజు భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్‌లో కీలకంగా మారింది. ఐదవ రోజు ఏడు వికెట్స్ తీస్తే.. మ్యాచ్ భారత్ […]
కన్య రాశి వారు ఈరోజు మీ స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వలన కానటువంటి, మీరు చేయలేనటువంటి పనులకు దూరంగా ఉండండి. అనవసరమైన హామీలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. అమ్మవారి అష్టకమమును పారాయణం చేయండి. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో ఈరోజు మీ […]
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం పంచుకున్నారు. నెల్లూరులో తనకు ఇంటర్ సీటును దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి.. ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాలో తిరిగానని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కి ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు అని పవన్ […]