కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి విరిగిన పాలతో అభిషేకం చేశారు అనేది అవాస్తవం అని ఆలయ ఈవో పెంచుల కిషోర్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని భక్తులు నమ్మొద్దన్నారు. టెండర్ దారుడు ఇద్దరు భక్తులకు విరిగిన పాలను అందించారని, ఆ ఇద్దరు భక్తులు అతనితో వాద్వాదించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఆ పాలను అభిషేకానికి వినియోగించలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అర్చకులు పరిశీలించిన అనంతరమే స్వామివారికి అభిషేకం చేపట్టారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్యాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయకండని ఆలయ ఈవో కోరారు.
Also Read: Prasanna Kumar Reddy: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మరోసారి విమర్శలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి!
కాణిపాకం ఆలయంలో అపచారం చోటు చేసుకుందని గురువారం ఉదయం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. విరిగిన పాలతో వినాయకుడికి అభిషేకం చేశారని ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయ ఈవో పెంచుల కిషోర్.. అవన్నీ అసత్యాలు అని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో కాణిపాకం ఒకటి. శివుడు, పార్వతీ దేవికి ఇష్ట కుమారుడు గణేశుడు ఇక్క కొలువై ఉన్నాడు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. ఇక్కడ వినాయకుని విగ్రహం ఎల్లప్పుడూ నీటిలో ఉంటూ.. రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం, 2002లో భక్తులు విరాళంగా సమర్పించిన వెండి కవచంలు ప్రస్తుతం స్వామి వారికి సరిపోవడం లేదు.
