విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడ. శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో గాయపడడంతో ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావల్సిన డెకాయిట్ వాయిదా పడింది.
గాయం నుండి కోలుకుని ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసాడు శేష్. తాజాగా డెకాయిట్ టీజర్ ను హైదరాబాద్ లోని ఈవెంట్ లో కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు. శేష్ సినిమాల మాదిరిగానే ఈ డెకాయిట్ టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో శేష్, మృణాల్ దొంగలుగా నటిస్తున్నారు. దొంగతనాలు చేసే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వారిని వెంబడించే పోలీసులు లాంటి సెటప్ తో టీజర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ లో అక్కినేని నాగార్జున ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో సాంగ్ ను రీమిక్స్ చేసి వాడిన విధానం చాలా బాగుంది. టీజర్ లో ఇదే హైలెట్ అని కూడా చెప్పొచ్చు. భీమ్స్ మంచి బీజీఎమ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా మార్చి 19న తెలుగు, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.