మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతేకాదు రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) పోరాడారు. ఈ ఇద్దరు వెనుదిరిగినా.. వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్; 206 బంతుల్లో 9×4, 1×6), రవీంద్ర జడేజా (107 నాటౌట్; […]
Fans Urge Asia Cup 2025 Boycott Over India vs Pakistan Clashes: 2025 ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో సెప్టెంబరు 14, 21 తేదీల్లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీక ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అవసరమా?, ఆసియా కప్ 2025 […]
Sunil Gavaskar Slams Team India Management: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేదా కెప్టెన్ శుభ్‌మన్ గిల్లో ఎవరు తుది జట్టుపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? అని అభిమానుల మెదడును తొలిచేస్తోంది. గిల్ ధైర్యంగా తన అభిప్రాయాలను కోచ్ ముందు వెల్లడిస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. […]
Abhimanyu Easwaran Awaits for Debut since 2021: భారత జట్టులో అరంగేట్రం కోసం క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2021లో టీమిండియాలో భాగం అయినా.. నాలుగు సంవత్సరాలుగా అరంగేట్రం నోచుకోలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అభిమన్యు ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు బాదాడు. అయినప్పటికీ ఆండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో చోటు దక్కని అభిమన్యుకు చివరి […]
BTech Ravi Counter to Satish Reddy: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. ‘చావు దగ్గరకు వస్తే ఒక చేయి మీసం మెలేస్తా’ అనే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు? అని విమర్శించారు. ధైర్యవంతుడు, పెద్ద డైలాగ్స్ కొట్టే సతీష్ రెడ్డి వేల్పుల ఘటనలో ఎందుకు దాక్కున్నావు? అని ప్రశ్నించారు. వేల్పుల కాల్పుల ఘటనలో గన్‌మెన్ ఫైర్ చేశారా, లేక నువ్వే గన్ […]
Govt School Teacher Suspended in Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్పీ వాడ జడ్పీహెచ్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్కె ప్రసాద్ అనే ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. ఈ నెల 24న మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు గాను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌పై వేటు పడింది. ఈ ఘటనను విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంపై సోషల్ మీడియాలో […]
Double Bedroom Scam Exposed in Kuthbullapur: ప్రభుత్వ పథకం ‘డబుల్ బెడ్రూమ్’ హౌసింగ్ పేరున రాజకీయ నాయకుల అనుచరులు, అధికారులు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నేను పలానా ఎమ్మెల్యే పీఏను, నాకు ఆ మంత్రి బాగా తెలుసు, నేను ప్రభుత్వ ఆఫీసులోనే పనిచేస్తాను అని చెప్పి.. డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత తమది అంటూ పేద ప్రజల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడిన వారిని ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
Kondapur Apartment Rave Party: ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘రేవ్ పార్టీ’. ఆ మధ్య బెంగళూరులో, ఈ మధ్య సింగర్ సావిత్రి రేవ్ పార్టీలు వార్తల్లో నిలిచాయి. రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రెటీలు, బడా బాబుల పిల్లలు, రాజకీయ నేతల కుమారులు పట్టుబడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూసింది. […]
Rishabh Pant to Bat in Second Innings Despite Injury: మాంచెస్టర్‌లోని నాలుగో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త. జట్టు కోసం గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ విషయాన్ని కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా ధ్రువీకరించాడు. పంత్ తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని తాను అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు […]
KLR Pharmacy College Ragging Case: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ బాధిత విద్యార్థిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ర్యాగింగ్ వేధింపులు భరించలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం […]