Bheemili Domestic Violence: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య వేడివేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సలసల కాగే నీటికి అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై […]
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా? […]
YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా […]
India playing XI against England for 5th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాల స్థానాల్లో ధృవ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. […]
తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?, […]
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. జనాలకు అండగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గిరిజనులపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను సందర్శించిన జనసేనాని.. అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు పంపి మంచి మనసు చాటుకున్నారు. […]
MP Vemireddy Prabhakar Reddy Shutting Down Quartz Business Amid Criticism వేయి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తారా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. సేవ చేద్దాం అనుకుంటే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాల కోసం ఫిని క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ పేరుతో రెండు కంపెనీలు పెట్టానని.. ఇప్పుడు క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నా అని తెలిపారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫ్యాక్టరీ […]
RS 11 Crore Cash Seized in Kubera Movie Style in Hyderabad: ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగితే.. హైదరాబాదులో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. అచ్చం ‘కుబేర’ సినిమా తరహాలో ఫామ్‌హౌస్‌లో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కుబేర సినిమా స్టైల్లోనే బియ్యం బస్తాలు, అల్మారాలో డబ్బులు దాచి పెట్టారు. ఏకంగా 11 కోట్ల రూపాయలను సర్దేసి పెట్టారు. ఎవరో వస్తారు.. కీ చెప్తారు.. డబ్బులు […]
India withdrawing from WCL 2025 semifinal vs Pakistan: భారత్ అభిమానులకు నిరాశ. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 నుంచి భారత్ ఛాంపియన్స్ టీమ్ వైదొలిగింది. దాయాది పాకిస్థాన్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జులై 31న భారత్ ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి […]
AP Farmers to Receive RS 7000 in First Phase on August 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ […]