Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ నిన్న (ఆదివారం) సోషల్ మీడియాలో పలు వీడియోలు, స్టోరీలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు తాజాగా జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తనకు శేఖర్ మాస్టర్‌కి మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వారని, తామిద్దరం ఒకే కుటుంబంలా ఎప్పటినుంచో కలిసి ఉంటున్నామని చెప్పారు. ఒకరికి ఒకరం ఎప్పుడూ అండగా నిలిచామని, తమ మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, కథనాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ రూమర్స్ వైరల్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సినిమా షూటింగ్ సెట్స్‌లో తనతో (జానీ మాస్టర్), శేఖర్ మాస్టర్ ఇద్దరితో మాట్లాడినట్లు వెల్లడించారు. అనంతరం ముగ్గురూ కలిసి కొంతసేపు సరదాగా గడిపి, కలిసి భోజనం కూడా చేసినట్లు వెల్లడించారు. చిరంజీవి గారు చూపించిన ప్రేమ, మార్గదర్శకత్వం, మద్దతు తమకు ఎంతో విలువైనవని జానీ మాస్టర్ పేర్కొన్నారు. చివరగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన కోరారు. ప్రేమ, పరస్పర గౌరవం, సానుకూల దృక్పథంతో అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.… pic.twitter.com/oCOsngCtwI
— Jani Master (@AlwaysJani) July 13, 2026
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!