Virat Kohli will play ODI World Cup 2027: టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టి సారించాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడడంతో.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో విరాట్ ఆడనున్నాడు. ఈ సిరీస్ విరాట్ కెరీర్‌కు చివరిది కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే తనలో ఇంకా ఆడే సత్తా ఇంకొన్నేళ్లు ఉందని కింగ్ ఓ […]
Sara Tendulkar and Shubman Gill Relationship News: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని చూసి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ సమయంలో మెడిసిన్ చేసే అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. స్నేహితురాళ్లు ‘సచిన్.. సచిన్’ అంటుండగా.. ఎయిర్‌పోర్టులో మొదటిసారి చూశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం జరగగా.. 1995 మే 24న పెళ్లి […]
కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరు లోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర […]
Hyderabad Rains Today: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘హైడ్రా’ అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది. […]
Ravichandran Ashwin Reveals Scam Attempt Using Devon Conway’s Name: చెన్నై సూపర్ కింగ్స్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టు ప్రణాళికల్లో తాను లేకుంటే.. టీమ్ నుంచి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఫ్రాంచైజీకి అశ్విన్ తెలియజేసినట్లు సమాచారం. గత వేలంలో రూ.9.75 కోట్లకు అశ్విన్‌ను కొనగా.. 9 మ్యాచ్‌లాడి 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే అతడిని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా […]
Telangana to Launch Tourist Police Units: తెలంగాణలో పర్యాటక పోలీసులు త్వరలో రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ వెల్లడించారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని […]
మంగళవారం హైదరాబాద్ చందానగర్‌లోని ఖాజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్‌లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా […]
Lineman Restores Power in Middle of Lake in Siddipet: గత 5-6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల చెట్లు నేలకొరగడం, భారీ గాలులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు […]
‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా టీఎస్ఆర్టిసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ రోజు ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల […]
Supreme Court Cancels Telangana MLC Appointments: తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో కోదండరామ్, ఆమిర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకంను రద్దు చేసింది. కోదండరామ్, అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇద్దరి నియామకాలను సవాల్ చేస్తూ.. దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, […]