కొత్త సంవత్సరం రోజు ఈ తప్పులు చేయొద్దు.. ఏడాది పొడవునా చిక్కుల్లో పడొద్దు..!
కాలం వేగంగా పరిగెత్తుతుంది.. నెలలు, సంవత్సరాలు.. ఇలా మారుతూనే ఉన్నాయి.. అయితే, నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మార్పు కాదు.. ఇది కొత్త ప్రారంభాలు, కొత్త ఆలోచనలు.. సానుకూల మార్పులకు సమయంగా తీసుకోవాలి.. ఓ టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాలి.. ఇది సాధిస్తాను అనే గోల్ పెట్టుకోవాలి.. ఓ మార్పునకు శ్రీకారం చుట్టాలని అని పెద్దలు చెబుతారు.. ఇక, మతపరమైన మరియు జ్యోతిష్యశాస్త్ర నమ్మకాల ప్రకారం, సంవత్సరంలో మొదటి రోజున తీసుకునే చర్యలు మొత్తం సంవత్సరంపై ప్రభావం చూపుతాయి అని నమ్ముతారు.. అందువల్ల, నూతన సంవత్సరాన్ని ఆలోచనాత్మకంగా ప్రారంభించడం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఆ రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఆ తర్వాత ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు..
టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్‌ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్‌లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇందులో సియెర్రా. ev(Sierra.ev), అప్డేటెడ్ పంచ్.ev ( Punch.ev) 2026 తొలి అర్థభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది చివరి నాటికి టాటా నుంచి తొలిసారిగా ప్రీమియం ఈవీ కార్ ‘అవిన్యా’(Avinya) రాబోతోంది. FY2027, FY2030 మధ్య మరో మూడు కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. అతనికి తోడుగా అట్కిన్సన్ 2 వికెట్లు.. స్టోక్స్, కార్స్ ఒక్కో వికెట్‌తో సహకరించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మైఖేల్ నేసర్ (35), ఉస్మాన్ ఖవాజా (29) మాత్రమే కాస్త పోరాడారు.
నా క్రష్ ఆ హీరోయినే.. ఓపెన్ అయిన ప్రొడ్యూసర్ నాగవంశీ
టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన స్పీచ్‌లకు యూత్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఆయన ఓపెన్ అయిన ఆ హీరోయిన్ క్రష్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయనను మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనేదాని గురించి ప్రశ్న అడగ్గా.. దానికి ఆయన స్పందిస్తూ.. తనకు ఎప్పుడూ హీరోయిన్ పూజా హెగ్డే అంటే ఇష్టమని అన్నారు. అలాగే తనకు హీరోయిన్ రష్మిక మందన్నా అంటే కూడా ఇష్టమని చెప్పారు. ప్రస్తుతానికి తన క్రష్ ఎక్కువగా మృణాల్ ఠాకూర్ అని ఓపెన్ అయ్యారు. లాస్ట్ టైం ఈ ప్రొడ్యూసర్ హీరో విజయ్ దేవర కొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాగవంశీ నిర్మాతగా నవీన్ పొలిశెట్టి హీరో ‘అనగనగా ఒక రాజు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కప్ప ప్రేగులోని బాక్టీరియాతో క్యాన్సర్‌కు చెక్..! ఎలుకలపై ప్రయోగం సక్సెస్..
మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిలవచేసిన ఫుడ్, ఫ్యాకింగ్ ఫుడ్.. ఇలా ఎన్నో క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.. అయితే, క్యాన్సర్ సోకితే ఇక అంతే అనుకునే పరిస్థితి నుంచి.. క్యాన్సర్‌కు చెక్ పెట్టే స్థాయి వరకు కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.. ఇప్పటికే కొన్ని చికిత్సలు, మందుల లాంటివి కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు.. శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. జపనీస్ చెట్టు కప్ప (డ్రైఫైట్స్ జపోనికస్) ప్రేగులలో కనిపించే బాక్టీరియా క్యాన్సర్‌తో పోరాడడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా నిరూపించబడింది. ఎలుకలపై నిర్వహించిన పరీక్షలలో, ఒక నిర్దిష్ట బాక్టీరియం ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా కణితులను పూర్తిగా తొలగించింది.
ఉత్కంఠ మ్యాచ్ లో కోహ్లీ జట్టు విజయం..!
విజయ్ హజారే ట్రోఫీ 2025 ఎలైట్ గ్రూప్–Dలో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గుజరాత్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 పరుగులు చేయగా.. కెప్టెన్ రిషభ్ పంత్ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు హర్ష్ త్యాగి 40 పరుగులతో చివర్లో పరుగులు రాబట్టాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైస్వాల్ 4 వికెట్లతో మెరిశాడు.
పరకామణి కేసులో కీలక పరిణామం.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు..
టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి కీలక సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న ఏపీ హైకోర్టు.. ఈ కేసులో సీఐడీ ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.. కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా.. విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
10 ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి నుంచి “బాల పురస్కారం”.. ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఏం చేశాడంటే..
10 ఏళ్ల బాలుడు శ్రవణ్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’’ దక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధభూమిలో ఉన్న మన జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందిస్తూ తన దేశభక్తిని చాటుకున్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి క్రమం తప్పకుండా సేవ చేశాడు. శ్రవణ్ సింగ్ కనబరిచిన దేశభక్తికి రాష్ట్రపతి నుంచి శుక్రవారం ఈ పురస్కారం దక్కింది. ‘‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు, సైనికులు మా గ్రామానికి వచ్చారు. నేను వారికి సేవ చేయాలని అనుకున్నాను. నేను వారికి ప్రతిరోజూ పాలు, టీ, మజ్జిగ, ఐస్ తీసుకువెళ్లేవాడిని’’ అని బాలుడు మీడియాతో చెప్పారు. 10 ఏళ్ల బాలుడి సేవ దేశభక్తిని వయసుతో కాదు, చర్యలతో నిర్వచిస్తాయి అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.‘‘ ఫిరోజ్‌పూర్‌లోని చక్ తరణ్ వాలి గ్రామానికి చెందిన 10 ఏళ్ల శ్రావణ్ సింగ్ అసాధారణ ధైర్యం, కరుణను ప్రదర్శించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, అధిక ప్రమాదకర సరిహద్దు పోస్టుల వద్ద ప్రమాదం పొంచి ఉండగా, శ్రావణ్ నిస్వార్థంగా ఫ్రంట్ లైన్‌లో ఉన్న భారత సైనిక సిబ్బందికి నీరు, పాలు, టీ అందించాడు. చాలా మంది పెద్దలు సంకోచించే చోట స్థిరంగా నిలిచాడు. అతని ధైర్యం, సేవా భావం దేశభక్తిని వయస్సు ద్వారా కాదు, చర్య ద్వారా నిర్వచించబడుతుందని మనకు గుర్తు చేస్తుంది’’ అని ఎక్స్‌లో ఎంపీ ట్వీట్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి నీటి కేటాయింపులపై కేసీఆర్ సమరశంఖం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
‘మీ చేతికి మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’.. ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదని.. ముఖ్యంగా 22ఏ భూ సమస్యల నుంచి రైతులకు, సామాన్యులకు విముక్తి కలిగించి, వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ చేతికి మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 10 గంటల పాటు ఏకధాటిగా ఫిర్యాదులు స్వీకరించారు. సాధ్యమైనంత వరకూ వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు.