రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 4 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తు లో ఉంటారన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు గోల్కొండ కోటలో ప్రభుత్వం తరఫున అధికారిక వేడుకలు జరుగనున్నాయన్నారు. ఇదిలా […]
తెలంగాణ బీజేపీకి ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు లేనట్టేనా? ఇక మేటర్ మొత్తం సంస్థాగత ఎన్నికల తర్వాతే సెటిల్ అవుతుందా? తాము ఎంపిక చేసే బదులు కొత్త అధ్యక్షుడిని కేడరే ఎన్నుకుంటే బెటరని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? కొత్త అధ్యక్ష పదవి కేంద్రంగా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల అభిప్రాయం ఎలా ఉంది? జాతీయ స్థాయిలో సభ్యత్వ నమోదుకు సమాయత్తం అవుతోంది బీజేపీ. ఈ నెల 17న ఢిల్లీలో సభ్యత్వ నమోదు పై వర్క్‌షాప్ జరగనుంది. ఆ […]
“నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో సూక్ష్మ కళాకారుడు గుండుపిన్నుతో చాక్ పీస్ పై 78 జాతీయ జెండాలను తయారుచేసి దేశభక్తిని చాటాడు. గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ 78వ స్వాతంత్యం దినోత్సవాన్ని పురస్కరించుకుని 8 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటి మీటర్ వెడల్పు గల చాక్ పీస్ పై 4 మిల్లీ మీటర్ల ఎత్తు ఉన్న 78 ఔతీయ జెండాలను సుమారు 3 గంటల పాటు […]
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. […]
తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ బుధవారం నామినేట్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున, సింఘ్వీకి సీటు కోసం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ తన బలంపై ఆధారపడే అవకాశం ఉంది. […]
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చామన్నారు. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి […]
తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి […]
Samsung, Oppo, Motorola వంటి కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా ఇప్పుడు Google కూడా ఫోల్డబుల్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ఇంతకు ముందు కూడా ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసినప్పటికీ, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొదటి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మేడ్ బై గూగుల్ ఈవెంట్లో ప్రారంభించబడింది, ముఖ్యమైన ఫీచర్ల గురించి మాట్లాడుతూ, ఈ ఫోన్లో గూగుల్ టెన్సర్ జి4 ప్రాసెసర్ […]
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు […]