విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీఇన్ని కావు. చుట్టూ వరద నీరు ముంచేత్తిన అవసరాల కోసం చుక్క మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. సితార ప్రాంతంలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరకడంతో భావి వద్దకి బాధితులు క్యూ కడుతున్నారు. వరద నీటిలో కష్టాలు పడుతూ బిందెలు బకెట్లు టిన్నులతో నీళ్లను తోడుకుని వెళ్తున్నారు. బిందె నీటి కోసం దూర ప్రాంతాల నుంచి బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. విజయవాడ వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి కష్టాలు ఒక్కోరకంగా ఉంటున్నాయి. కింద వరద ముంచేత్తడం పైనుంచి కొండ రాళ్ళు జారిపడటంతో పలు ప్రాంతాల్లో స్థానికులు భయాందోళన మధ్య జీవనం సాగిస్తున్నారు. సితార ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండరాళ్లు జారిపడి ఇళ్లు దెబ్బతింటున్నాయి.
Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..
అర్ధరాత్రి సమయంలో ఇంటిపై రాళ్లు పడడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిలో ప్రాణాపాయం తప్పిందని.. కిందికి వెళితే వరద .. పైన ఉంటే ప్రమాదంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్ సృజన సమీక్షిస్తున్నారు. మొన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కొండప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Wolf Attacks: నరమాంసానికి మరిగిన తోడేళ్లు.. 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..