తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి […]
Samsung, Oppo, Motorola వంటి కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లకు పోటీగా ఇప్పుడు Google కూడా ఫోల్డబుల్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ఇంతకు ముందు కూడా ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసినప్పటికీ, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొదటి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మేడ్ బై గూగుల్ ఈవెంట్లో ప్రారంభించబడింది, ముఖ్యమైన ఫీచర్ల గురించి మాట్లాడుతూ, ఈ ఫోన్లో గూగుల్ టెన్సర్ జి4 ప్రాసెసర్ […]
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు […]
పాతబస్తీ బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసును బాలాపూర్ పోలీసులు ఛేదించారు. ఈనెల 9వ తేదీన బాలాపూర్ ARCI రోడ్డుపై రియాజ్ పై కాల్పులు జరిపి హతమార్చింది సూపారీ గ్యాంగ్. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్ లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించామని, ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేశామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నాడని […]
ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. 9.20 గంటలకి పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం […]
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించామని, […]
గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు […]
ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది? ముందు ఒక ఊపు ఊగినా… తర్వాత వ్యవహారం ఎందుకు చప్పున చల్లారింది? వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమేనా? ఫస్ట్ టైం ఈ ఫార్మాట్లోకి వచ్చిన సత్తిబాబు తనదైన శైలిలో పావులు కదిపారా? ఇదంతా ఆయన చాణక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధత నిలబడిందా? బొత్స సత్యనారాయణ….తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన పోటీలో వుంటే […]
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద టీడీపీ తరపున పోరాడారాయన. ఒక రకంగా చెప్పాలంటే… నియోజకవర్గంలో పార్టీకి కేరాఫ్. కానీ… ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకున్నారు. తీరా తాను మారిన పార్టీ ఓడిపోయి… పాత పార్టీ పవర్లోకి వచ్చేసరికి దాదాపు మైండ్ బ్లాక్ అయిందట. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారిన ఆ నేత ఎవరు? ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో పులివెందుల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పొలిటికల్‌గా […]
“వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం.. వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్‌సభ ఎంపీలను, 10 […]