ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి రుణ మాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని […]
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.. అనంతరం స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని, ఖమ్మం గడ్డ మీద నుంచే రెండు లక్షల రుణ మాఫి గురించి హామి ఇచ్చామన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చింది అంటే హామీ నెరవేర్చలసిందేనని, పట్టువదలకుండ భట్టి […]
పెద్దగోల్కొండ ORRపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్ పై తుఫాన్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తుక్కు గూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు […]
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పతకాలను ప్రదానం చేసిన ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీకి చెందిన 18 మంది అధికారుల్లో ఇంటర్‌పోల్‌తో సంబంధం ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు కూడా ఉన్నారు. ఆరుగురు అధికారులకు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీసు పతకాలు లభించాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ కుమార్ కె, […]
ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలో ఒక మిలియన్ టన్ను (ఎంఎన్టి) లిక్విడ్ స్టీల్ ఉత్పత్తితో మైలురాయిని సాధించింది. భారతదేశపు ప్రభుత్వ రంగ ఉక్కు తయారీకి సరికొత్త ప్రవేశంగా, NSL అధిక-నాణ్యత ఉక్కు ఉత్పత్తులను అందించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది , పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం ద్వారా బలీయమైన ప్లేయర్‌గా స్థిరపడిందని కంపెనీ పత్రికా ప్రకటన గురువారం తెలిపింది. ఆగస్ట్ 12, 2023న, NSL ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌లోని అధునాతన 3 MTPA స్టీల్ ప్లాంట్‌లో […]
తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సాయుధ యోధులకు అమరవీరులకు నివాళులు.. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ వచ్చిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారామ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభం చేయడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో బిజీ కొత్తూరు సీతారామ పంప్ హౌస్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జన్మ ధన్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా […]
తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప […]
ఆషాఢం ఆశాజ్యోతిలా కనిపించిన బీఆర్ఎస్ పెద్దలకు శ్రావణ గండం పొంచి ఉందా? ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? రకరకాల రీజన్స్ చూపిస్తూ… పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా భయపడేలా చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు కూడా ఒక్కొక్కరే కొంత కాలంగా పార్టీని వదిలేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో […]
పుట్టపర్తిలో కొత్తగా పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయా? లోకల్ వైసీపీ నాయకులు షేకవుతున్నారా? ఎప్పుడు ఏ అధికారి వచ్చి తలుపు తడతారోనని కంగారు పడుతున్నారా? ఎందుకంత కంగారు? పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రంగా ఏం జరుగుతోంది? పాలకవర్గంపై ఉన్న గోల్మాల్ ఆరోపణలేంటి? శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రాజకీయ నాయకులు , అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పనులు […]