హైదరాబాద్ కూకట్ పల్లి IDL చెరువు వద్ద ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి నిమజ్జన ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా వినాయక నిమజ్జనాలు జరుగుతాయన్నారు. చెరువుల్లో బేబీ పాండ్ లను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ లాంటి మురికి నీళ్లల్లో నిమజ్జనం చేయడం బాధాకరమన్నారు ఈటల రాజేందర్. ప్రభుత్వం ప్రత్యేకంగా […]
స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం […]
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు. మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత […]
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలని భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా ఆరంభించడం హర్షనీయమన్నారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కొరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు జీవన్ రెడ్డి. దశబ్దకాలం […]
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది. 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర […]
రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రూ. […]
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం […]
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించినం. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం. ముద్రా రుణపరిమితిని పెంచినం. […]
రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి ఆనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్తకు చేరుకుంది. అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల […]