యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే […]
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ […]
హోం మంత్రితో నటి జత్వానీ భేటీ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..! ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం. […]
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పీసీసీగా నియామకం అయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ NSUI అధ్యక్షుడిగా ఉన్నాని ఆయన అన్నారు. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారు.. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారని, వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి […]
ఆస్పత్రి యాజమాన్యం చేసిన తప్పు ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారుల తీరుతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేశారు. ఈ నెల 5న జ్వరంతో ఉన్న 45 రోజుల పసికందు దష్విక్ ని తల్లిదండ్రులు […]
రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి […]
హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని ఓ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడులో ముగ్గురు తీవ్రంగా సహా కనీసం ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కిషన్‌బాగ్‌లోని జనసాంద్రత ఎక్కువగా ఉండే అసద్‌బాబా నగర్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావం కారణంగా, ఆస్బెస్టాస్ పైకప్పు ఉన్న ఇల్లు బాగా దెబ్బతింది , ఆ ప్రాంతంలో ష్రాప్నల్ ఎగిరి పొరుగు భవనాల గాజు ముఖభాగాన్ని […]
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వనకు పుట్టిస్తున్నారు రెవెన్యూ, హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎకరాల కొలది భూములను చెరపట్టారు. భూకబ్జాదారుల నుంచి భూములను విముక్తి కల్పించడానికి కాప్రా రెవెన్యూ అధికారులు దూకుడు మొదలుపెట్టారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడులకు ఐదు ఎకరాల భూమిపై నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి […]
2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ల భర్తీకి జనరల్ రిక్రూట్మెంట్ కు రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ & డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ […]
ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైన భారత బాక్సర్ నిఖత్ జరీన్ బుధవారం ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో నిఖత్ జరీన్‌ను డీఎస్పీ పోస్ట్‌లో నియమించినట్లు డీజీపీ ప్రకటించారు. “రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ అయిన నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన కొత్త పాత్రను స్వీకరించినందుకు మేము గర్వంగా స్వాగతిస్తున్నాము. నిజామాబాద్‌కు […]