HYDRA : చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు
- చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు
- సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో సమీక్ష
- చెరువులు.. సరస్సుల లెక్కలపై సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తోన్న హైడ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం తన అధికారుల బృందంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. 1971 – 72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులున్నాయి.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ప్రస్తుతం వాటి పరిస్థతి ఏంటి. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి.. ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయని మ్యాప్‌లను పరిశీలించారు ఏవీ రంగనాథ్. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లతో పాటు.. నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వివరించారు.
Samantha: ప్రతి అమ్మాయికి అలాంటి బ్రదర్ ఉండాలన్న సమంత.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో.. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై ఓ అవగాహన రానుంది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారించడంలో సర్వే ఆఫ్ ఇండియాను కూడా భాగస్వామ్యం చేయడం.. సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదిక తయారీ చేయడం జరుగుతోందని హైడ్రా అధికారులు తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా సేకరించిన డేటాను డిజిటలైజేషన్‌తో పాటు.. అస్సలు చెరువుల విస్తీర్ణం ఎంత, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి పూర్తి వివరాలతో నివేదికను సిద్ధంగా ఉంచడం.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించి.. తదుపరి చర్యలను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో చెరువులను ఒకదాని తర్వాత ఒకటిగా పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది.
Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!