ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని, రైతులకి సోలార్ సిస్టం కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో కరెంట్ పాత్ర చాలా ముఖ్యమైనదని, విద్యుత్ సిబ్బంది అధికారుల పాత్ర చాలా ప్రాధాన్యత వుంటుందన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయ పంపు సెట్ల ను నెలరోజుల్లోనే ఇస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. విద్యుత్ సిబ్బంది అధికారులు పొలం బాట పట్టాలని, ఇక్కడ విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Kolkata: వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా
పొలాల్లో స్థంబాలు ఒరిగిపోకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రజల ప్రాణాలు కూడా చాలా ముఖ్యమని, హ్యుమాన్ లాస్ ఎక్కడ జరుగవద్దని ఆయేన అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం మారాల్సి వుంటుందని, విద్యుత్ శాఖ కు కూడా స్టాఫ్ కలశాల ఏర్పాటు చేయాలన్నారు. పంచ వ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులు ఆ కళాశాల లో నేర్పించలసి వలసి వుంటుందని ఆయన అన్నారు. పదేళ్ల లో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ లు ఇచ్చామని, ఖాళీలు వున్న ప్రాంతాలని ఐడెంటిఫై చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. సిబ్బంది నియామకం జరుగుతుందని ఆయన తెలిపారు.
Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్‌లో టెండర్లు..