దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సదస్సుకు జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి టెలికాం కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు 33 దేశాల కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ దేశాల నుంచి బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారని, అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల […]
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు. […]
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్ గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల […]
ములుగు జిల్లాలోని మేడారం వనదేవతలను మంత్రి కొండా సురేఖ దంపతులు దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి కొండా సురేఖ.. సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన కోట్లాది భక్తులను ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా ఇండ్లకు భక్తులను పంపించే విధంగా వనదేవతలు కాపు కాస్తారని ఆమె కొనియాడారు. […]
పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్.. షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు. ‘‘అభివృద్ధి, […]
క్షేత్ర స్థాయిలో కీలక సేవలందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీల వైద్యులు, ఆశాలు, ఏఎన్ఎంలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వ్యాధిని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారు. గత సంవత్సరం రికార్డు ప్రకారం.. మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 76.3% డెలివరీలు జరగడం సరికొత్త రికార్డు. అయితే.. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారిపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు చేస్తున్న కృషి గొప్పది. […]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పనికట్టుకుని బురద జల్లే పనిలో పడ్డారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని, కానీ కేటీఆర్.. హరీష్ లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది అర్దం అవ్వడం లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండని, […]
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కింద నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న సరస్సును డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ కంపెనీ యుఎస్టి నీటి వనరుగా మార్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యంతో , UST యొక్క బొంగులకుంట సరస్సు పునరుద్ధరణ చుట్టుపక్కల ప్రాంతంలోని 250 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది , 1,000 మంది నివాసితులకు వారి బోర్వెల్ల ద్వారా నమ్మకమైన నీటి సరఫరాను అందిస్తుంది. సరస్సు పునరుద్ధరణతో పాటు, చెరువు చుట్టూ ఒక నడకదారి […]
క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. […]
భద్రాద్రి జిల్లాలోని మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని, అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు […]