Ponnam Prabhakar : హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన , సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఆ సమాచారాన్ని మరొకరకంగా ఉపయోగించబడదని ఆయన భరోసా ఇచ్చారు. సర్వే ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కులాల జనాభా వివరాలను సేకరించడం, అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ అసమానతలను తొలగించడం అని తెలిపారు. ఈ సర్వే 6వ తేదీ నుండి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనున్నది. సర్వేలో 150 నుండి 175 ఇళ్ల వరకు ప్రతి ఎన్యూమరేటరుకు కేటాయించబడ్డాయి. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు.
AP Assembly Sessions: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం