క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. […]
భద్రాద్రి జిల్లాలోని మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని, అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు […]
ఎర్రన్నల మధ్య ఏకాభిప్రాయం లేదా? సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం ఉందా? ఒక కార్యక్రమం విషయంలో పరస్పరం మాట్లాడుకోకుండా… ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఆయనో రకం, ఈయనో రకం అన్నట్టు రెండు కమిటీల్లోని ముఖ్యులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోంది? హైదరాబాద్‌లో ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అలాగే… అంతకు ముందు రోజు.. ప్రొఫెసర్ సాయిబాబా […]
అక్కడ ఎమ్మెల్యేకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ చూపిస్తోంది కూడా సొంత కేడరే కావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదట. పార్టీ అధిష్టానం దగ్గర పరువు పోతోందిరా.. ప్లీజ్… ఈసారికి కో ఆపరేట్ చేయండర్రా… అని బతిమాలుకుంటున్నా… డోంట్ కేర్,… ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏ గాడిదలు కాసిందని ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారట. అంతలా ఇరకాటంలో పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన బతిమూలుడు, బామాలుడు యవ్వారం? కొమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం […]
పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు , విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల రాష్ట్ర […]
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా […]
SCO సమ్మిట్ కోసం పాకిస్తాన్ చేరిన జైశంకర్.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత […]
మంత్రి కొండా సురేఖ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న , జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌లను మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావు చేసిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన […]
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్‌లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు […]
ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు […]