DCP Narasimha : సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని, ఎక్కువ ఫిర్యాదులు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాళ్లంతట వల్లే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని, 3 కోట్ల30లక్షల విలువ చేసే 1100 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఫోన్ లు రికవరీ చేసామని, సీఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోయిన మొబైల్ ట్రేస్ అవుతుందన్నారు. ఈ సంవత్సరంలో 4వ సారి ఈ మొబైల్స్ రికవరీ చేసామని, సైబరాబాద్ పరిధిలో లోని 45పోలీసు స్టేషన్ పరిధిలోని అందరు కష్టపడడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.
Ande Sri on Telangana Thalli: అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి
అంతేకాకుండా..’సైబరాబాద్ లో 7500మొబైల్స్ రికవరీ చేసాము… 5500ఫోన్లు ఈ సంవత్సరం రికవరీ చేసాము… ఫోన్ల రికవరీ లో సైబరాబాద్ 2వ స్థానం లో వుంది… తప్పు చేసేవాళ్ళు భయపడాలి… విలువైన వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి… ప్రతి ఒక్కరు సీసీటీవీ లు అమర్చుకోవాలి… సమాజంలో అసంఘిక శక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలి… దొంగతనాలకు పాల్పడేవారిపై నిత్యం నిఘా పెడతాం… ప్రతి కాలనీ లో సీసీటీవీ ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టగలం… ఒక సీసీటీవీ వంద మంది తో సమానం… నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవాలి… సైబర్ క్రైమ్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది… అటువంటి సైబర్ బారిన పడొద్దు… మనం స్తోమత మనకు తెలిసేలా ఉండాలి… అత్యాశ సైబర్ క్రైమ్ కు దారి తీస్తుంది… బ్యాంకు అధికారులు అని,ఇతర తెలియని నెంబర్ ల నుండి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి… కొరియర్ లో ఎదో మాదక ద్రవ్యలు ఉన్నట్లు వీడియో కాల్ చేసి బయపెడతారు… అటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి… ఎటువంటి భయం లేకుండ పోలీసులకు ఫిర్యాదు చేయాలి… సిబిఐ కేసు అయిందని డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెడతారు… ఆన్లైన్ ఫ్రాడ్ పట్ల జాగ్రత్త వహించాలి…’ అని డీసీపీ నర్సింహ తెలిపారు.
C-Section Delivery Back Pain: సి-సెక్షన్ డెలివరీ వెన్నునొప్పికి దారి తీస్తుందా? నిజమెంత?