Ponnam Prabhakar : మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల పై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో ఏంజెపి గురుకుల సెక్రటరీ సైదులు , ఆర్సీవో లు, డిసిఓలు , ప్రిన్సిపల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏదైనా స్కూల్లో సమస్యలు ఉంటే వెంటనే సెక్రటరీకి తెలియజేస్తే సెక్రెటరీ ద్వారా ప్రభుత్వానికి ఆ సమస్యలను చెప్పి పరిష్కరించడానికి ప్రతి ప్రిన్సిపల్ కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. విద్యార్థుల కోసం ఇప్పటికే సొంత భవనాలు ఉన్న 21 గురుకుల పాఠశాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 4 సొసైటీ కార్యదర్శులలో తో కలిసి మెనోచార్టు ఫైనల్ చేసి ఆ మెనూలో మార్పులకు అనుగుణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని కి అధిక ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త మెనూను అతి త్వరలో విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన పోషక ఆహారాన్ని అందించడంపై శ్రద్ధ వహించాలన్నారు.
అంతేకాకుండా..’విద్యార్థులలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వెంటనే వారికి చికిత్స అందించాలి . కల్చరల్ ఆక్టివిటీస్ కి పిల్లలలోని కోకరికులం ఆక్టివిటీస్ కి వారిలోని సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా, ఆహారం నాణ్యత ప్రమాణాల కోసం మహాత్మ జ్యోతిబాపూలే లో టాస్క్ ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెరిట్ గల విద్యార్థులను అభినందించాలి వారికి కావలసిన ప్రత్యేక అవసరాలు ఏమైనా ఉన్నా కానీ ఆర్సీవోలు దృష్టికి తీసుకువచ్చి వారిద్వారా సెక్రటరీ దృష్టికి తన దృష్టికి తీసుకురావాలి. రానున్న పబ్లిక్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధించేలా ప్లాన్ అఫ్ యాక్షన్ రెడీ చేయాలి. వచ్చే పదవ తరగతి పరీక్షలలో ఎం జె పి విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలి. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి లో విద్య నైపుణ్యాలను పెంచడానికి కృషి చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారం, వసతి సదుపాయాలు కల్పిస్తూ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. అధికారులు నిర్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Teacher MLC : రేపు కాకినాడ జేఎన్టీయూలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్