CHAKRASIDDH: గుండెపుడి గ్రామంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరం. జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో చక్కర సిద్ధ ఆధ్వర్యంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని డాక్టర్ సత్య సింధుజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో గుండెపుడి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎటువంటి మందులు ఆపరేషన్ లేకుండా ప్రాచీన చక్ర సిద్ధ వైద్యం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన డాక్టర్ సత్య సింధుజ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డాక్టర్ సత్య సింధుజ మాట్లాడుతూ ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన ఈ చక్రసిద్ధ వైద్యం ఇకపై గ్రామాలకు కూడా విస్తరింపజేసేందుకుగాను ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇక మునుముందు కూడా ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాల్లో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.
Kareena Kapoor : నేనేం కొంపలు కూల్చనంటున్న స్టార్ హీరోయిన్
ఈ కార్యక్రమంలో జెకె ఆర్ట్స్ అధినేతలు కాళ్లూరు జగదీష్ కుమార్, యమునా కిషోర్, కాళ్లూరు వెంకటేశ్వరరావు, కాల్లూరు ప్రవీణ్, గిరి శంకర్, కొమ్మినేని కృష్ణయ్య, కొమ్మినేని పాండురంగారావు, దుద్దుకూరు సుమంత్, దిలీప్ కుమార్, ఎస్ కే జానీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలా నాయక్, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, మాజీ ఎంపిటిసి మధు,తదితరులు పాల్గొన్నారు.
MLA Parthasarathi: నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే.. ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు!