జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024ను పార్లమెంట్ లభించింది. అయితే, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై విస్తృత అధ్యయనం కోసం జేపీసీని ఏర్పాటు చేయగా.. అందులో లోక్ సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఈ జేపీసీ కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని స్పీకర్ ఓంబిర్లా నియమించారు. సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, మనీశ్ తివారీ, ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు.
రూ.6 లక్షల విలువైన పాత కారును రూ.లక్షకు అమ్మినా రూ.90 వేలు జీఎస్టీ కట్టాల్సిందేనా?
పాత ఈవీ వాహనాలపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. ఈ నిర్ణయం తర్వాత రూ.6 లక్షలకు కారు కొని ఆ తర్వాత రూ.లక్షకు అమ్మేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు మధ్యలో రూ. 5 లక్షల మార్జిన్‌పై 18శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే రూ. 5 లక్షల 18శాతం.. అంటే రూ. 90,000 పన్ను. ఈ వైరల్ పోస్ట్ తర్వాత, ప్రజల్లో గందరగోళం పెరిగింది. ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాల (EV) పునఃవిక్రయంపై 18 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి నిర్ణయం చాలా గందరగోళాన్ని సృష్టించింది. కార్ల రీసేల్ మార్జిన్ వాల్యూపై పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ వారు ఉపయోగించిన కార్లను విక్రయించే వ్యక్తులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని పొరపాటుగా అర్థం చేసుకున్నారు. అయితే, అది అలా కాదు. పన్నును వాస్తవానికి ఉపయోగించిన కార్ల పునఃవిక్రయంలో పాల్గొనే వ్యాపార సంస్థ ద్వారా చెల్లించాలి, వ్యక్తిగత విక్రేత ద్వారా కాదు.
పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు.. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేంద్రం!
పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మోడీ సర్కార్ కుంభకర్ణుడిలా నిద్ర పోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయితే, ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అందులో, ఇటీవల గిరినగర్‌లోని కూరగాయల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. అక్కడ సామాన్యులతో ధరల పెరుగుదలపై ప్రధానంగా చర్చలు జరిపారు. అలాగే, దాని వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరలు పెరగడంతో ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాన్య ప్రజలు వెల్లడించారు.
వారికి జాతకాల పిచ్చి ఉంది.. హరీష్ రావుకు నాయిని రాజేందర్ కౌంటర్
వారికి జాతకాల పిచ్చి ఉందని, ఎవరో చెప్పినట్టున్నారు మీరు జైల్లోకి వెళ్తారని? అంటూ హరీష్ రావుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. కేయూ ప్రొఫెసర్ వారి పెళ్లికి వరంగల్ కి వచ్చి.. నిర్మాణంలో ఉన్న హాస్పిటల్ గురించి మాట్లాడే వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ హరీష్ రావు? అని ప్రశ్నించారు. టైటానిక్ తీరుగా ఉన్న ఇటువంటి వరంగల్ సెంట్రల్ జైలును తీసేసి… మహారాష్ట్ర బ్యాంకుల్లో లోన్ తీసుకొని విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. వారికి జాతకాల పిచ్చి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలో భారీ వర్షాలు!
పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతం, దానిని నానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. నేడు అల్లూరి అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.
వీఆర్వోల నియామక ప్రక్రియ షురూ.. పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు..
భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలు గ్రామాలకు తిరిగి రానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన భూభారతి బిల్లుల్లో గ్రామస్థాయిలో కొత్త రెవెన్యూ అధికారులను నియమిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మళ్లీ వీఆర్వో విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామాల్లో పని చేసేందుకు రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. సర్వేయర్ల నియామకంపైనా దృష్టి సారించింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసి ఇతర విభాగాలకు బదిలీ అయిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. అలాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని వారు అనుమానిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు.
చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి
సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన పరిణామాలపై దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. అల్లు అర్జు్న్‌ను ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్‌ల సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశ్నించారు. దాదాపు 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు పోలీసులు ఉంచారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు పోలీసులు చూపించారు. ఆ రోజు రాత్రి 9.30 గంటల నుంచి సంధ్య థియేటర్ బయటకు వెళ్లేవరకు ఏం జరిగిందనే దానిపై ప్రశ్నలు అడిగారు.
ఈ ఏడాది 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చాం..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్ అఫెన్స్ కోసం పీఎస్ ఏర్పాటు చేశాం అందులో కేసులు నమోదయ్యాయని, ఎకనామిక్ అఫెన్సెస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.. ఎకనామిక్ అఫెన్స్ పీఎస్ ను మరింతగా విస్తరిస్తామన్నారు సీపీ అవినాష్ మహంతి. నార్కోటిక్స్ కట్టడికి పని చేస్తున్నాం.. డ్రగ్స్ కేసులు అనేకంగా నమోదయ్యాయి అదేవిధంగా అరెస్టులు కూడా జరిగాయని, ట్రాఫిక్ విషయంలో పబ్లిక్ ను ఇబ్బంది పెట్టేవి.. రోడ్ ప్రమాదాలకు కారణం అయ్యే అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఐటీ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమిస్తున్నాం.. రోడ్ వైడనింగ్ చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు.
శ్రీతేజను పరామర్శించిన డీకే అరుణ
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు.