Robo Shankar : తమిళ సినిమా రంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ ఇకలేరని సినీ వర్గాలు ధృవీకరించాయి. అనారోగ్యంతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, సెప్టెంబర్ 18న కన్నుమూశారు. వయసు 46 సంవత్సరాలు. కొన్ని నెలలుగా ఆయన కామెర్లు సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి విషమించి మృతిచెందారు. రోబో శంకర్ కెరీర్ “హే”, “దీపావళి” సినిమాలతో ప్రారంభమైంది. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్‌తో కూడిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనుష్ నటించిన “మారి” సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అజిత్‌తో “విశ్వాసం”, శివకార్తికేయన్‌తో “వేలైక్కారన్” వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
Suicide: తాగుడు మానేయమన్న భర్త.. మినీ ట్యాంక్ బండ్ లో దూకిన భార్య..
రోబో శంకర్ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ భావోద్వేగంతో స్పందిస్తూ.. “రోబో శంకర్ అనేది ఒక పేరు మాత్రమే, నా కోసం నువ్వు తమ్ముడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు? నీ పని పూర్తయింది, నువ్వు వెళ్ళిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది” అంటూ నివాళి అర్పించారు. రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నై వలసరవక్కంలోని ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Weather Alert : హైదరాబాద్‌ను కుమ్మేస్తున్నక్యూములోనింబస్ మేఘాలు.. మరో 2 గంటల్లో