BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్‌ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను 2014లో చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయడం ద్వారా భద్రాచల రామాలయ భూములు ఏపీ హద్దుల్లోకి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
ఈ భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రామాలయ ఈఓపై దాడి జరిగిన విషయాన్ని ఆమె హైలైట్ చేశారు. “రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ, అదే రాముడి ఆలయాన్ని ముంచే కుట్రలు చేస్తోంది” అంటూ విమర్శించారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె కోరారు.
ఇదే సమయంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో బీజేపీ తెలంగాణ ఉనికి పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువచేసే విధంగా ఉందన్నారు.
“మన చరిత్ర తుడిచివేయబడితే, మనం ఎవరం?” అంటూ ప్రశ్నించిన కేటీఆర్, బీజేపీ ఉద్దేశాలు స్పష్టంగా చెప్పాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇది పార్టీ నిబంధనల్లో భాగమా, లేక ఒక వ్యక్తిగత అభిప్రాయమా అన్న దానిపై సమాధానం కోరారు. నిజమే అయితే, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
VC Sajjanar : కాసులకు కక్కుర్తి.. సెలబ్రిటీలపై సజ్జనార్ షాకింగ్ కామెంట్స్