Digital Arrest : డిజిటల్ అరెస్ట్ మాయతో కోట్లకు మోసం.. హైదరాబాద్ మహిళకు టోకరా
- డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళ ఆస్తులు తాకట్టు
- సైబర్ మోసగాళ్ల తెగులుపై అలర్ట్
- ప్రముఖ నాట్యాచార్యుడు రాజ్ కుమార్ అరెస్ట్
- ముల్ అకౌంట్ల సరఫరాదారుడిగా నిర్ధారణ
- దుబాయ్ పారిపోతున్న నిందితుడు ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest : హైదరాబాద్ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజ్‌కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్ అకౌంట్లను (ఫేక్ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనేక మందిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
పోలీసుల సమాచారం ప్రకారం, డిజిటల్ అరెస్ట్ అంటూ మహిళను బెదిరించి, ఆమె ఆస్తులు మరియు బంగారం మొత్తం తాకట్టు పెట్టించారు. అనంతరం ఆ మొత్తాన్ని దోచుకుని ఫైనాన్స్ సంస్థల ద్వారా నకిలీ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన సైబర్ నేరగాడు గోయల్‌తో కలిసి పనిచేసిన అల్లుడాస్ సుధాకర్‌ను కూడా అరెస్ట్ చేశారు.
దుబాయ్‌కి పారిపోతున్న సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో అల్లుడాస్ సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు రాజ్‌కుమార్ కూడా గోయల్‌కు సహకరించినట్టు స్పష్టమైంది. ఈ ఇద్దరూ స్కామ్ సూత్రధారులతో సమన్వయం చేస్తూ బాధితురాలిని లక్ష్యంగా చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన దర్యాప్తులో డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెనుక ఉన్న ముఠా తలాలపై స్పష్టత వచ్చింది. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Kingdom : హమ్మయ్య కింగ్డమ్ నిర్మాత గట్టిక్కినట్టే.. OTT ఎంత వచ్చిందంటే
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!