Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని […]
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని.. 27శాతం కుంగిపోయిందని.. కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని.. లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్‌రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ మూడేళ్ల క్రితమే.. NTV చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ.. రియల్ ఎస్టేట్ పతనంపై NTV ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ […]
TBJP Chief : తెలంగాణ బీజేపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు […]
ట్రంప్ హెచ్చరిక.. పన్నులను తొలగించే వరకు కెనడాతో చర్చలుండవ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని […]
Anchor Swetcha : తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాంకర్ స్వేచ్ఛ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ పరిచయమైందని స్వప్న పేర్కొంది. వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదని, వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని స్వప్న వివరించింది. Hydra: మాదాపూర్ లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు.. అంతేకాకుండా.. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు […]
Weather Updates : తెలంగాణ ప్రజల నిరీక్షణకు తెరపడింది.. ఎప్పటిలా కాకుండా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే పలకరించాయి, జూన్ చివరి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులతో స్వాగతం పలికాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు, బీడు భూములకు జీవం, నగరవాసులకు ఉపశమనం.. సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలయ్యే రుతుపవనాలు, ఈసారి కాస్త తొందరగానే తెలంగాణ గడ్డను తాకాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. […]
అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4:50 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. రాత్రి 7:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. రాత్రి 7.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్.. నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,56,554 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. […]
HYDRA : హైదరాబాద్ నగరంలోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని సాయి సారధి నగర్లో ఉన్న decades-old పార్కు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (HYDRAA) ఆదివారం కూల్చివేసింది. వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ప్రజావాణి ఫిర్యాదు ఆధారంగా, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు నిర్వహించిన విచారణలో 1961లో రూపుదిద్దుకున్న 35 […]
సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు మస్క్.. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. […]
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో […]