Anchor Swetcha : ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కొక్కటిగా కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె కుమార్తె అరణ్య, తండ్రి శంకర్ ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు స్వేచ్ఛను పదేళ్లపాటు పెంచిన మేనమామ అత్త సుశీల నరసయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ చిన్ననాటి నుంచి తమ ఇంటిలో ఎంతో ప్రేమతో పెరిగిందని ఆమె భావోద్వేగంగా గుర్తుచేశారు. సుశీల మాట్లాడుతూ .. “స్వేచ్ఛను నాలుగు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి […]
Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు […]
మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ […]
Orange Travels : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ వంకరగా ఉన్న రహదారిపై బస్సు అదుపు తప్పి […]
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు.. విజయవాడ: నేడు దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. హైదరాబాద్ ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో బోనం. జంటనగరాల్లో ఆషాఢ శోభ. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచే బోనాల ఉత్సవాలు ఆరంభం. నగరంలో ఘనంగా రాష్ట్ర పండుగ బోనాల పండుగ ఉత్సవాలు.. ఇవాళ్టి నుంచి నాలుగు ఆదివారాలు జంటనగరాల్లో బోనాల సందడి. […]
Shocking : ఇది పబ్జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్లైన్ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు […]
Jupally Krishan Rao : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ను తిరస్కరించేలా చేశాయి అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆదర్శ పాలనకు దూరమైన చర్యలు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానం అని […]
దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అయితే చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని […]
ఏదైనా దేశాన్ని టార్గెట్ చేయాలంటే యుద్ధం చేయాలి. లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు. అంతే కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తిచేస్తాయి. ఇప్పుడు ఏ దేశానికైనా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి రెగ్యులర్ సమస్యల కంటే డ్రగ్స్ భూతమే పెనుముప్పుగా దాపురించింది. డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి. పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లమ్ అనుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ […]
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు […]