Ramchander Rao : 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదు
- మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాం
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారు
- లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా :బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు రామచందర్ రావు. మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారని, లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా ? అని ఆయన ప్రశ్నించారు.
తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే అంశాలు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 2006లో అయ్యర్ కోహ్లీ కేసులో .. సుప్రీంకోర్టు మరోసారి కేశవనంద భారతి కేసు తీర్పు ను దగ్గర మరోసారి పునరుద్ఘాటించిందన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి …బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ దే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎన్నికలు జరగకుండా ఉండేందుకు జరిగే ఎత్తుగడే ఈ మోసమని ఆయన ఆరోపించారు.
Also Read
తమిళనాడు తీర్పు నేపథ్యంలో …తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టే పరిస్థితి లేదని, పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు రామచందర్‌రావు. నాయకులందరూ పార్టీ విధానాలకు లోబడే పని చేయాలని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ రాజగోపాల్ రెడ్డి మధ్య సమస్యలు.. బీఆర్ఎస్ లో కవితకు పార్టీకి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ప్రతి పార్టీలోనూ గొడవలు ఉన్నాయి వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామన్నారు.
Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!