Gogikar Sai Krishna
Author- NTV Telugu-
సచివాలయంలో పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది : వెంకట్రామిరెడ్డి
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు […] -
బ్రేకింగ్ : అసదుద్దీన్ ఒవైసీకి Z కేటగిరీ భద్రత
మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు […] -
పాతబస్తీలో కొనసాగుతున్న హై అలెర్ట్
పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో పాతబస్తీ లో టెన్షన్ నెలకొంది. […] -
టార్గెట్ హిడ్మా.. ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్
హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు. […] -
ఎన్టీవీ షార్ట్ న్యూస్
విశాఖపట్నంలో పప్పుల చిట్టీ స్కామ్ లో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సబ్బేళ్ల రామారెడ్డిని అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీసులు విచారిస్తున్నారు. సంక్రాంతికి వంట సరుకుల పేరుతో చిట్టీల వ్యాపారం చేసిన ఎలియాబాబు అలియాస్ రవి.. చోడవరం,నర్సీపట్నం ఏరియాల్లో ఏడు వేల మందికి పైగా ఖాతాదారుల వద్ద నుండి సుమారు ఐదు కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడు. ఎలియాబాబు, రామారెడ్డి నిందితులుగా తేల్చిన పోలీసులు…ఇప్పటికే ఎలియాబాబు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో హార్స్ […] -
యాదాద్రికో న్యాయం..వేములవాడ రాజన్నకో న్యాయమా : ఎమ్మెల్యే రఘునందన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. రఘునందన్ రావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్నిఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ నువ్వు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నావ్, సిరిసిల్ల కి ఎన్ని నిధులు పోయాయి..వేములవాడ కి ఎన్ని నిధులు ఇచ్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా వేములవాడ […] -
కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత అల్టిమేటం
భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు. […] -
50 ఏళ్ళ ‘పాకీజా’
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన […] -
సినిమానే ఏ.యమ్.రత్నం ప్రాణం
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల […] -
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. […]
తాజావార్తలు
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!