Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahishasuramardhini: టాలీవుడ్లో విభిన్నమైన స్టోరీలు, ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ క్రిష్.. ప్రస్తుతం తన కెరీర్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆయన ఓ యానిమేషన్ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘మహిషాసురమర్ధిని’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్రిష్ ఇప్పటివరకు చారిత్రక, పీరియాడిక్, సామాజిక అంశాలతో కూడిన స్టోరీలను తనదైన మేకింగ్‌తో తెరకెక్కించారు. ఇప్పుడు తొలిసారిగా యానిమేషన్ జానర్లో సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు కామన్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జానపద అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని టాక్.
ఇక ‘మహిషాసురమర్ధిని’ అనే టైటిల్ కావడంతో ఈ సినిమా స్టోరీపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా? లేక పురాణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కొత్త కథను చెప్పబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే సినిమా కథ, పాత్రలు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు వార్తలు రావడంతో ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాని ఈ సినిమాపై ప్రత్యేక బజ్ అనేది క్రియేట్ అయ్యేలా చేస్తోంది. యానిమేషన్ సినిమాలకు భారీ స్థాయిలో విజువల్స్, సాంకేతిక నైపుణ్యం అవసరం కావడంతో ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ప్రచారం అవుతున్న ఈ యానిమేషన్ మూవీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘మహిషాసురమర్ధిని’ అనే టైటిల్ ఈ చిత్రానికి ఖరారైతే, క్రిష్ కెరీర్లోనే ఇది అత్యంత విభిన్నమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కథ, పాత్రలు, నిర్మాణ వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!