విశాఖపట్నంలో పప్పుల చిట్టీ స్కామ్ లో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సబ్బేళ్ల రామారెడ్డిని అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీసులు విచారిస్తున్నారు. సంక్రాంతికి వంట సరుకుల పేరుతో చిట్టీల వ్యాపారం చేసిన ఎలియాబాబు అలియాస్ రవి.. చోడవరం,నర్సీపట్నం ఏరియాల్లో ఏడు వేల మందికి పైగా ఖాతాదారుల వద్ద నుండి సుమారు ఐదు కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడు. ఎలియాబాబు, రామారెడ్డి నిందితులుగా తేల్చిన పోలీసులు…ఇప్పటికే ఎలియాబాబు అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ లో హార్స్ రేస్ ల పై బెట్టింగ్ లకి పాల్పడుతున్న ముఠా సభ్యులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిర్వహకులతో సహా మొత్తం ఐదుగురిని ఎల్బీనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 42 లక్షల రూపాయల నగదు, 2 ల్యాప్ టాప్ లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరి కొద్ది సేపటిలో పూర్తి వివరాలు ప్రెస్ మీట్ లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించనున్నారు.
రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ బీజేపీ నిరసనలను, ఆందోళనలను కొనసాగించనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ “భీమ్ పాదయాత్ర” చేపట్టనుంది. బండి సంజయ్ తోపాటు పాదయాత్రలో తెలంగాణ బీజేపీ ఎంపీలు సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్ కోలార్ ఎమ్.పి మునుస్వామి తదితరులు పాల్గొననున్నారు. “భీమ్ పాదయాత్ర” ప్రారంభానికి ముందు మీడియా తో బండి సంజయ్ మాట్లాడనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లొదోడ్డిలో 5గురు గిరిజనులు మృతికి కారణం విషపూరితమైన కల్లు త్రాగడమేనని పోలీసులు వెల్లడించారు. జీలుగు కల్లుకుండలో కలిపింది విషమేనని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంలో ఈ విషయాన్ని కాకినాడ జీజీహెచ్ వైద్యులు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. లోతైన నిర్ధారణ కోసం మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాల తరలించారు. ఒకరి కోసం వేసిన పన్నాగానికి 5గురు బలయ్యారా..? అనే కోణంతో పాటు.. ఈ ఘటనలో ఓ వాలంటీర్ ప్రమేయాన్నీ కూడా పోలీసులు శోధిస్తున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సాధారణ స్ట్రీమ్‌ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. “ఇప్పుడు ఫిజికల్ క్లాసుల కోసం కాలేజీలు తిరిగి తెరవబడినందున, సంబంధిత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి, త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి తెలిపారు.