Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి
- అలాంటి వ్యక్తులను స్వేచ్ఛగా తిరగనివ్వొద్దు
- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్లపై రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో వైద్యులపై దాడులకు పాల్పడే రాజకీయ నేతలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి వ్యక్తులను స్వేచ్ఛగా తిరగనివ్వొద్దని స్పష్టం చేసింది. కళ్యాణ్‌లోని శాస్త్రినగర్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో శివసేన కౌన్సిలర్ రమేశ్ మ్హాత్రే బెయిల్ షరతులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ రద్దు కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం
మ్హాత్రే తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు మ్హాత్రేకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఆసుపత్రిలో ఏం జరిగింది?
దహీ హండి ఉత్సవాల సందర్భంగా గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంలో ఆదివారం తెల్లవారుజామున వివాదం చెలరేగింది. కళ్యాణ్‌లోని రిలీఫ్ ఆసుపత్రి కారిడార్లలో మొదలైన గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పాల్ఘర్ పోలీసులు కనీసం 17 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన కొందరు సభ్యులు కూడా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ నిందితుడు రిసెప్షనిస్ట్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది. ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఉద్యోగిని కూడా నిందితుడు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్ సాంకే, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరత్ సహా పలువురు ఆసుపత్రి అత్యవసర విభాగంలోకి ప్రవేశించి.. గాయపడిన వ్యక్తిని డిశ్చార్జ్ చేయడంపై వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆసుపత్రి సిబ్బందిపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డాక్టర్లపై దాడులను తేలిగ్గా తీసుకోలేం
శాస్త్రినగర్ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడికి సంబంధించి శివసేన కార్పొరేటర్ రమేశ్ సుక్ర్యా మ్హాత్రేను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రుల్లో వైద్య నిపుణులపై జరిగే దాడులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు వైద్యులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని, స్వేచ్ఛగా తిరగకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!