Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romanchakam: థియేటర్లలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ సినిమా విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర సమర్పకుడు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ ప్రత్యేక పార్టీలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒకరినొకరు అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. రూరల్ బ్యాక్ గ్రౌండ్లో ప్రేమ, కామెడీతో పాటు స్టార్టప్ స్టోరీని మేళవించిన ఈ చిత్రానికి ముఖ్యంగా గ్యాంగ్ కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తన ఆఫీస్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ పార్టీలో సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో సందడి చేశారు. రోమాంచకం సక్సెస్ జోష్‌లో ఉన్న సందీప్ రెడ్డి వంగా షాంపెన్‌తో సెలబ్రేట్ చేశారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
రోమాంచకం కథ: హైదరాబాదులో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దానికోసం కష్టపడుతూ ఉంటాడు అన్వేష్ (సుమంత్ ప్రభాస్). అతనికి ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్లతో ఎప్పటికప్పుడు చిల్ అవుతూ ఉండే అన్వేష్, తన డేటింగ్ యాప్ ప్రిపరేషన్ కోసం మరో డేటింగ్ యాప్‌లో ఒక అమ్మాయితో మాట్లాడాలనే ఉద్దేశంతో మైథిలి (అనంతిక) అనే అమ్మాయికి కనెక్ట్ అవుతాడు. చెన్నైలో ఉండే ఆ అమ్మాయితో క్రమక్రమంగా బాండ్ పెరుగుతూ వెళ్తుంది. ఆమె పుట్టినరోజుకు ఏకంగా చెన్నై వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే, అతన్ని కలుస్తానని చెప్పి ఫోన్ బ్లాక్ చేసి ఆమె రివర్స్ సర్ప్రైజ్ ఇస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం కాక తలబాదుకుంటూ హైదరాబాద్ వచ్చిన అన్వేష్, చాలాకాలం పాటు ఈ డైలమాలోనే ఉండిపోతాడు. అనుకోకుండా తాను హైదరాబాద్ వస్తున్నానని ఫోన్ చేసిన మైథిలి, అన్వేష్ దగ్గరకు రావడమే కాదు, అతను సిద్ధం చేసిన ఒక ఫ్లాట్‌లో రెండు రోజులు ఉంటానని కూడా చెబుతుంది. అయితే, అన్వేష్ ఒక పని మీద బయటకు వెళ్లి వచ్చేలోపు సూసైడ్ నోట్ రాసి మిస్ అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? అనే విషయం తెలియక అన్వేష్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్ అంతా వెతుకుతూ ఉంటాడు. అయితే, అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? చెన్నై వచ్చిన అన్వేష్‌ను కలవకుండా ఫోన్ ఎందుకు బ్లాక్ చేసింది? మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ఆమె అన్వేష్‌ను కలిసిన తర్వాత సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిన కారణమేంటి? అసలు మైథిలి ఇబ్బంది ఏంటి? దాన్ని అన్వేష్ క్లియర్ చేశాడా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
And that’s #SandeepReddyVanga’s way of celebrating ❤️🔥❤️🔥❤️🔥
Cheers to the laughs, the love and everything #Romanchakam is bringing 🥂
Highly #Spirit-ed, as always. ❤️ pic.twitter.com/bsfG49UwzP
— Bhadrakali Pictures (@VangaPictures) September 6, 2026
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!