సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని, అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఇచ్చామన్నారు. 9 వేల సిరీస్‌తో సంక్రాంతి స్పెషల్ సర్వీసులు నడువనున్నాయన్నారు. డీజిల్ రేట్లు […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. వనమా రాఘవను నియోజకవర్గానికి, […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ […]
కరోనా రక్కసి మరోసారి తెలంగాణాలో రెక్కలు చాస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో యావత్తు దేశంతో పాటు తెలంగాణవాసులూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా తెలంగాణలో వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. అయితే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,052 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో మరో 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా […]
విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన విజయవాడలో జనవరి 1న ప్రారంభమైంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే బుక్ ఫెయిర్ సందర్భంగా నేడు పుస్తక ప్రియులు పాదయాత్రి నిర్వహించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ నుంచి స్వరాజ్ మైదానం వరకు ఈ పాదయాత్ర జరిగింది. అయితే ఈ పాదయాత్రను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ ప్రారంభించారు. అంతేకాకుండా […]
ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ […]
గత రెండు రోజులుగా తెలంగాణ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేడు సికింద్రాబాద్‌లోని మహత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిచేందుకు పిలుపు నిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జేపీ నడ్డాను ఆహ్వానించేందుకు కొందరినీ మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు. అయితే అనుమతించిన […]
ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన ధరలకు సినిమాలు ప్రదర్శించలేమని థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసివేశారు. ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో సంక్రాంతి పండుగగకు విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఈ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీలో టికెట్ల ధరలపై స్పందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి […]
రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు. […]
టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేశారు. […]