సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున పోలీసుల దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. సైఫాబాద్ నుండి ఓ కారులో మహిళలు నాంపల్లి వైపు వెళుతుండగా బస్సుకు వారు ప్రయాణిస్తున్న కారు కు మైనర్ ఆక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. అయితే ఇంతలోనే స్పాట్ కు చేరుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్ ఓ కానిస్టేబుల్ లాఠీతో మహిళలను కొట్టారు. దీంతో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న యువకులు, బాధిత కుటుంబం సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.
నాంపల్లి పోలీస్ స్టేషన్ సీఐ ఖలీల్ పాషా, సైఫాబాద్ డీఐ రాజు నాయక్ లు బాధితులను శాంతింప జేసీ ప్రయత్నం చేశారు. విచారణ జరిపి ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు నచ్చచెప్పరు. బాధిత మహిళ ఎస్సై, కానిస్టేబుల్ పై ఇచ్చిన ఫిర్యాదును నాంపల్లి సీఐ ఖలీల్ పాషా స్వీకరించారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటన అనంతరం సైఫాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ ఎదుట 144 సెక్షన్ విధించి, అనంతరం రోడ్డు పై గుమిగూడిన అందరినీ అక్కడి నుండి పంపించేశారు. పోలీసులు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు.