Telangana IT Minister KTR will visit Karimnagar Today. And Laid The Foundation Stone for many Sevelopment Works.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కనీసం 3 కోట్ల నిధులు తెచ్చాడా అని ఆయన విమర్శించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. డబ్బాలో రాళ్ళేసి ఊపినట్లు ఒకటే లొల్లి చేస్తాడని, హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్ కు ఏమీ రాదని ఆయన వ్యాఖ్యానించారు.
కరీంనగర్ కు కనీసం ఓ గుడి అయినా తెచ్చావా.. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం పీకారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మూడేళ్ళలో మూడు పైసల నిధులైనా తెచ్చారా.. ముస్లింలంతా దేశానికి ద్రోహులన్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ను తిట్టుడు తప్ప ఏమైనా చేశాడా.. మతం పిచ్చి కడుపు నింపదు.. బండి సంజయ్ యువతను చెడగొడుతున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే గంగుల కమలాకర్ మీద మళ్ళా పోటీ చేసి గెలువు.. గంగుల కమలాకర్ మళ్ళా లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.