Former MP Boinapally Vinod Clarity on Railway Line.
కరీంనగర్‌లో నేడు మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మన కేసీఆర్ మనకోసం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కరీంనగర్ నగరంకు రైల్వే లైన్ వచ్చింది..కరీంనగర్ నుండి సిద్దిపేట వరకు అక్కడి నుండి సిరిసిల్ల వరకూ లైన్ రాబోతుందని ఆయన వెల్లడించారు.
కరీంనగర్ జాతీయ రహదారి కూడలిగా ఉండాలని ఢిల్లీలో జాతీయ రహదారి హబ్ గా ఆఫీస్ ఏర్పాటు చేసామని, అనవసర రాద్దాంతం ఎవరు చేస్తారు పని ఎవరు చేస్తారో తెలుసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలోనే కేబుల్ బ్రిడ్జి ఆలోచన చేశాం.. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటున్నామన్నారు. జిల్లాకు విభజన జరిగితే కరీంనగర్ అభివృద్ధి కాదు అని అన్నారని ఆయన తెలిపారు. కానీ.. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.