Congress Senior Leader Shabbir Ali Tour At Kamareddy District.
తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలంటూ టీ కాంగ్రెస్ ‘మన ఊరు.. మన పోరు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ఈ మా పోరు. రాజకీయాల కోసం కాదు రైతుల సమస్య కొరకై ఈ కార్యక్రమమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొనుగోలు చేయమని కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటారని ఆయన విమర్శించారు. ప్రజలు రైతులు కలిసి కేసీఆర్‌కు, ప్రభుత్వం లోని మంత్రులకు ఉరి వేయాలని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఒకప్పుడు ఎక్కువ సమయం కేటాయించేవారు ఈ సంవత్సరం 11 రోజుల్లో ఖతం చేశారన్నారు. పోచారం స్పీకర్ అయినంక అసెంబ్లీలో డెబిట్ ఎక్కువ పెడుతాడు. రైతు బిడ్డ అనుకున్నాం. అందరికీ సమయం ఇస్తారు అనుకున్నాం అలా జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కానీ కేసిఆర్ కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోంది.. సమస్యలపై నోరెత్తితే మా సభ్యుల మైక్ కట్ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికీ ఒకే ట్యాక్స్ ఉంటే బాన్సువాడ లో పోచారం కుటుంబం రెండు ట్యాక్స్ లు వసూలు చేస్తారని, పేదవాడు ఇళ్ళు కట్టుకుంటే ఇసుకకు ట్యాక్స్ లు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎల్లారెడ్డిలో 20న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నే మా ఊరు మా పోరు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్టర్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు గడుగు గంగాధర్‌లు హాజరయ్యారు.