Minister Ganguly Kamalakar said happy to be born in Karimnagar.
కరీంనగర్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ లతో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ పుట్టిండు.. నేను కూడా పుట్టినందుకు సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామన్న కూడా సీఎస్ హాస్పిటల్ లోనే పుట్టిండు కరీంనగర్ నగరం కేటీఆర్ జన్మస్థలం కావడం వల్లే రామన్నకు ఎనలేని ప్రేమ అని ఆయన అన్నారు. కరీంనగర్‌కు మెడికల్ కాలేజ్ వేంకటేశ్వర టెంపుల్ ఇచ్చినందుకు కేసీఆర్ కు రుణపడి ఉంటామని, అద్భుతమైన మానేరు రివర్ ఫ్రాంట్ కు రామన్న శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. సంవత్సరంలో మానేరు రివర్ ఫ్రాంట్ 400 కోట్లతో నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు.
నగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు రుణపడి ఉంటామని తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ అప్పుడేలా ఉంది ఇప్పుడెలా ఉందో చూస్తే తెలుస్తోందని, భావితరానికి కరీంనగర్ ను గొప్పగా చెప్పుకునేలా తయారు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ హయాంలో సాఫ్ట్ వేర్ కంపినీలు ఉరుకులు పెట్టుకుని వస్తున్నాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టముగా ఉండి శాంతి భద్రతలుతో ఉన్నామని, రాష్ట్రంలో కరెంట్ నీళ్లు అన్ని సమృద్ధిగా ఉన్నాయని ఆయన అన్నారు.