మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విప్రో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినా స్థానికులుకి ఉద్యోగాలు వస్తేనే ఉపయోగము ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. స్థానికులకు ఉద్యోగులు వచ్చేందుకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్నారు. విప్రో హైద్రాబాద్ కి రావడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు.
రూరల్ ఏరియాలలో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని ఆమె వెల్లడించారు. వచ్చిన అవకాశాలును యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. అనంతరం విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని, తెలంగాణ ప్రభుత్వం కంపెనీలుకి పాజిటివ్ దృక్పథం తో స్వాగతం చెప్తుందని ఆయన పేర్కొన్నారు.