ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరిగింది. ప్రస్తుత సీజన్‌లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్లను కొల్పోయిన సీఎస్‌కే 154 స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ముందు ఉంచింది.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్, 50 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లి ఔటయ్యాడు. చెన్నై నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (75), రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్) చెలరేగారు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్ మరో 14 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సీఎస్‌కే సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.