కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకాకుండా కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే… సహించే ప్రసక్తే లేదు. వేటు తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటరు. వారు పనిచేయరు. పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే […]
టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత […]
సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు […]
తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50 […]
వికారాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలకు ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రాణాలను […]
చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రోజ్ గార్డెన్’. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నాష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ […]
ఈ నెల 25న రావాల్సిన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఆగమనంతో వెనక్కి వెళ్ళింది. అయితే ముందు ‘గని’ చిత్ర దర్శక నిర్మాతలు, ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలానే ఈ నెల 25న రావాల్సిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్’ చిత్రాలు మార్చి 4కు పోస్ట్ అయ్యాయి. కానీ ‘గని’ మాత్రం మార్చి 4న కూడా రాకపోవచ్చు! తాజాగా ఈ చిత్ర […]
పేదలంటే సీఎం జగనుకు విద్వేషం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎం జగనుకు ఇష్టం లేదని, ఉగాది నాటికి ఎంతమంది పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పునాది కూడా తవ్వకుండా పేదలు కోరుకున్న ప్రభుత్వమే ఇల్లు కట్టించాలన్న 3వ ఆప్షన్ నుంచి వెనక్కి తగ్గుతున్నారన్నారు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా, చంద్రబాబు […]
నిన్న జరిగిన కేసీఆర్ సభ విజయవంతమైనదుకు సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సీడీసీ ఛైర్మెన్ బుచ్చిరెడ్డి లు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్ట్ పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులం అందరం కృషి చేసి ప్రజలకు అందుబాటులో కి […]
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక-సారక్క జాతార ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 16 నుంచి 19వ తేది వరకు కన్నుల పండుగవగా జాతరను నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకుంనేందుకు కోట్లాది మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారంకు విచ్చేశారు. అయితే నిన్న తెలంగాణ తొలి మహిళ (గవర్నర్) తమిళసై సౌందరరాజన్ అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇవ్వాల్సిన ప్రొటోకాల్ […]